హాలీవుడ్ అవార్డ్స్‌‌‌‌కు ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌గా రామ్ చరణ్

హాలీవుడ్ అవార్డ్స్‌‌‌‌కు ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌గా రామ్ చరణ్

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్‌‌‌‌ సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్న ఈ చిత్రం.. ఆస్కార్‌‌‌‌‌‌‌‌కు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 12న లాస్ ఏంజెల్స్​లో జరగనున్న ఆస్కార్ ఈవెంట్‌‌‌‌ కోసం టీమ్ అంతా అమెరికా వెళ్లనున్నారు. ఇందుకోసం తాజాగా రామ్ చరణ్ యూఎస్‌‌‌‌ చేరుకున్నాడు. నిజానికి ఈ వేడుకకు ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది. అయితే అంతకంటే ముందు రామ్ చరణ్‌‌‌‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్‌‌‌‌ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌‌‌‌కు చరణ్‌‌‌‌ ప్రెజెంటర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకోసం ‘హెచ్‌‌‌‌.సి.ఎ’ సంస్థ తనను ఇన్వైట్ చేసింది. ఈనెల 24న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. విజేతల్లో ఒకరికి రామ్ చరణ్ చేతులమీదుగా అవార్డును అందించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ‘హెచ్‌‌‌‌.సి.ఎ’ అవార్డుల్లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అనే నాలుగు  కేటగిరిల్లో నామినేట్ అయింది. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌‌‌‌‌‌‌‌కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు అవార్డు రావాలని ఇండియన్ సినీ లవర్స్ అంతా కోరుకుంటున్నారు.