రామ్చరణ్ రంగస్థల ఎంట్రీకి 16 ఏళ్ళు..ఉపాసన ట్వీట్ వైరల్

రామ్చరణ్ రంగస్థల ఎంట్రీకి 16 ఏళ్ళు..ఉపాసన ట్వీట్ వైరల్

2007లో చిరుత(Chirutha) మూవీతో సినీ అరంగేట్రం చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(( Ram Charan)..గ్లోబల్ స్టార్ గా ఎదిగే వరకు తన ప్రస్థానాన్ని చాటుకున్నారు.తండ్రీకి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. రామ్ చరణ్ తన నటనలోనూ, డాన్స్ లోను తనదైన ముద్ర వేసుకుని..స్టార్ డైరెక్టర్స్ అందరికీ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయ్యాడు. తన కెరీర్ ఫస్ట్ మూవీ డైరెక్టర్ పూరీ రాసిన డైలాగ్స్ తో మెగా ఫ్యాన్స్ కు గుండెల్లో స్థానం పొందాడు. ఇక సుకుమార్ నుంచి వచ్చిన రంగస్థలం మూవీతో తన సహజమైన నటనను పరిచయం చేస్తూ శభాష్ అనిపించుకున్నారు

చిరుత సినిమా వచ్చి ఈ రోజుకు (సెప్టెంబర్ 28కు) 16 ఏళ్ళు అవుతుంది. ఇక ఆ తర్వాత రాజమౌళి మగధీర మూవీతో( Magadheera )భారీ క్రేజ్ ని సంపాదించుకున్నారు.రామ్ చరణ్ ఎంట్రీకి 16 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో..మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో సోషల్ మీడియా ట్రేండింగ్లో.. రామ్ చరణ్ నట ప్రస్థానం..స్పెషల్ వీడియోస్తో ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

మగధీర,ఆరెంజ్,ధృవ,నాయక్, రంగస్థలం వంటి వరుస హిట్స్తో రాణిస్తూ.. స్టార్గా ఎదిగాడు. RRR మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ గుర్తుపట్టేలా చేసుకున్నాడు. ఇక ఉపాసన(Upasana) తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేస్తూ..స్వీట్ 16, రామ్ చరణ్‌కు 16 ఏళ్లు అంటూ క్యాప్షన్‌తో ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేసింది. 2012 జూన్ 14న వీరి మ్యారేజ్ జరగగా..అప్పటినుండి మెగా ఫ్యాన్స్ అందరూ ఉపాసనను వదిన అని పిలవడం స్టార్ట్ చేశారు. 

గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన రామ్ చరణ్ ఒకవైపు భారీ ప్రాజెక్టులు చేస్తూనే..మరో వైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు తీయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం తమిళ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.