
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో నటిస్తోన్న రామ్ చరణ్.. ఇది పూర్తవకముందే బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు. ఆల్రెడీ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నట్టు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్‌తోనూ ఓ మూవీ చేయనున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. నర్తన్ చెప్పిన కథ చరణ్‌కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనే వార్తలు వినిపించాయి. కానీ నర్తన్ ఇటీవల శివ రాజ్‌కుమార్‌తో ‘మఫ్టీ’ ప్రీక్వెల్ అనౌన్స్ చేయడంతో చరణ్‌తో సినిమా ఆగిపోయింది అనుకున్నారంతా. అయితే కొంత ఆలస్యమైనా.. చరణ్, నర్తన్ కాంబినేషన్‌లో సినిమా రావడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. ఈలోపు రామ్ చరణ్... శంకర్ సినిమాతో పాటు బుచ్చిబాబుతో చేయాల్సిన మూవీని కూడా పూర్తి చేయాలనుకుంటున్నాడట. ఈ ప్రాజెక్టుపై అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది.