చరణ్ వచ్చే వరకు అన్నీ ఆపాల్సిందే.. ఇలా అయితే ఎలా అన్నా?

చరణ్ వచ్చే వరకు అన్నీ ఆపాల్సిందే.. ఇలా అయితే ఎలా అన్నా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంగ్ బ్రేక్ తీసుకోనున్నాడట. దీంతో ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ పోస్ట్ పోన్ కానున్నాయి. ఈ వార్త తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ ను మళ్ళీ ఎప్పుడు తెరపై చూస్తామా అని ఆశపడుతున్న ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశే ఎదురైంది. అసలు విషయం ఏంటంటే.. చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది. ఇందులో భాగంగా ఆమెకు డెలివరీ డేట్ కూడా ఇచ్చారట. దీంతో డెలివరీ తరువాత దాదాపు మూడు నెలల వరకు ఉపాసనతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాడట చరణ్.

పుట్టబోయే బిడ్డని, ఉపాసనని దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాడట. అందుకోసం కనీసం మూడు నెలల సమయం కేటాయించనున్నాడట చరణ్. దీంతో ప్రస్తతం ఆయన చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్నీ ఆపేయాలని టీమ్ కు సూచించాడట. ఈ కారణంగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కూడా లేట్ కానుందని సమాచారం. ఇది ఫ్యాన్స్ కు కాస్త బ్యాడ్ న్యూస్ అయినప్పటికి.. మెగా వారసుడు రాబోతున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ గ్యాప్ డైరెక్టర్ శంకర్ కు కూడా కలిసొచ్చేలానే ఉంది. ఆయన చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తూనే.. మరోపక్క కమల్ హాసన్ తో భారతీయుడు2 మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సమయాన్ని భారతీయుడు2 కోసం కేటాయించనున్నాడు శంకర్. ఇక చరణ్ తిరిగిచ్చాక గేమ్ ఛేంజర్ మూవీ తిరిగి స్టార్ట్ కానుంది.