
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉంది. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాకు తెలుగులో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పగా.. చరణ్ కోసం చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ గెస్ట్ రోల్ చేశాడు. ఇప్పుడు మరోసారి అదే స్నేహం కోసం సల్మాన్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో సల్మాన్‌తో కలిసి చరణ్ డ్యాన్స్ చేస్తున్నాడు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటను ఇప్పటికే చిత్రీకరించినట్టు తెలుస్తోంది. కీలకపాత్ర పోషిస్తున్న వెంకటేష్, హీరోయిన్‌గా నటిస్తున్న పూజాహెగ్డే కూడా ఈ పాటలో కనిపించ బోతున్నారు. తమిళంలో హిట్ అయిన అజిత్ సినిమా ‘వీరమ్’కి ఇది రీమేక్. ఇటీవల విడుదలైన ‘బిల్లి బిల్లి’ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పర్హద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది.