కొత్త ఫ్రెండ్ను పరిచయం చేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోస్

కొత్త ఫ్రెండ్ను పరిచయం చేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) తన కొత్త ఫ్రెండ్ ను తన అభిమానులకు పరిచయం చేశారు. తన ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇంతకీ రామ్ చరణ్ పరిచయ చేసిన ఆ కొత్త ఫ్రెండ్ ఎవరా అనుకుంటున్నారా. ఆ ఫ్రెండ్ పేరు బ్లేజ్ అంట. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తెలుపారు. 

ఆ ఫ్రెండ్ మరెవరో కాదు రామ్ చరణ్ తన కాంపౌండ్ లోకి వచ్చిన మరో గుర్రం. ఆ గుర్రం పేరు బ్లేజ్. తన కాంపౌండ్ లోకి వచ్చిన కొత్త గుర్రాన్ని పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేశారు రామ్ చరణ్.. బ్లేజ్, నా కొత్త ఫ్రెండ్.. అంటూ గుర్రంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చరణ్. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ కు చిన్నప్పటి నుండి గుర్రపు వ స్వారీ అన్నా, గుర్రాలు ఇష్టం అన్న సంగతి తెలిసందే. ఇప్పటికే తన కాంపౌండ్ లో చాలా గుర్రాలే ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త గుర్రాన్ని తీసుకున్నారు రామ్ చరణ్.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు రామ్ చరణ్. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.