నో డైలాగ్స్: సస్పెన్స్ తో వచ్చిన RRR టీజర్

నో డైలాగ్స్: సస్పెన్స్ తో వచ్చిన RRR టీజర్

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా  అని ఎదురు చూస్తున్న ఈ మూవీ సర్ ఫ్రైజ్ గ్లింప్స్ రిలీజైంది. ఈ వీడియో గ్లింప్స్‌లో తొలి సారి రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ( భీమ్‌ ఫర్‌ రామరాజు, రామరాజు ఫర్‌ భీమ్‌)గా కలిసి క‌నిపించే స‌రికి అభిమానులు సంబరపడిపోతున్నారు. వీడియో చూస్తుంటే రాజ‌మౌళి స్టైల్లో షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజైన భీమ్‌ ఫర్‌ రామరాజు, రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియోలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించినప్పటికీ..  ఈ గ్లింప్స్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచింద‌ంటున్నారు ఫ్యాన్స్. 45 సెకన్లు ఉన్న ఈ డియోలో డైలాగ్స్ ఏం లేకుండానే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మాత్రమే చూపించి సస్పెన్స్ క్రియోట్ చేశారు. ఈ మూవీలో అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ చాలా సార్లు వాయిదా పడింది. డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మెగా మూవీ..తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుందని టాక్. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 7న RRR సినిమాని థియేట‌ర్స్‌లోకి తీసుకురానున్నారు.