అమెరికాలో ఆస్కార్ వేడుకకు రామ్ చరణ్

అమెరికాలో ఆస్కార్  వేడుకకు రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్‭ను ఎంజాయ్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ 2023 వేడుకల్లో సందడి చేసిన ట్రిపుల్ ఆర్ టీమ్ మరోసారి ఆస్కార్ వేడుకల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్నారు. స్వామియే శరణమయ్యప్పా అంటూ ఉపవాస దీక్ష చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అయ్యప్ప దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాళ్లకు చెప్పులు లేకుండా చరణ్ నేలపై నడుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్‭కు ఎంపికైంది. మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. అంతకంటే ముందే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో పాల్గొనేందుకు రామ్ చరణ్ లాస్ ఏంజిల్స్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది.