PEDDI: రామ్ చరణ్ ‘పెద్ది’నుంచి క్రేజీ టాక్.. రూరల్ బ్యాక్డ్రాప్లో ఫస్ట్ సాంగ్.. రిలీజ్ డేట్ ఇదే!

PEDDI: రామ్ చరణ్ ‘పెద్ది’నుంచి క్రేజీ టాక్.. రూరల్ బ్యాక్డ్రాప్లో ఫస్ట్ సాంగ్.. రిలీజ్ డేట్ ఇదే!

ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ మూవీ ‘పెద్ది’(PEDDI).హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ రూరల్ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పెద్ది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా పెద్ది నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే, ఇందుకు సంబంధించిన సాంగ్ కంపోజిషన్ సైతం కంప్లీట్ అయినట్లు టాక్. ఇందుకు ఆస్కార్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో ట్యూన్ ఇచ్చాడని సమాచారం. అయితే, ఈ సాంగ్ వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25,2025న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఆగస్ట్ సెకండ్ వీక్లో ఇందుకు సంబంధించిన అప్డేట్ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రేజీ టాక్తో మెగా ఫ్యాన్స్ తమ మ్యూజిక్ బాక్సులను సిద్ధం చేసే పనిలోపడ్డారు. ఎందుకంటే, ఫస్ట్ గ్లింప్స్ తోనే పెద్ది మ్యూజిక్ స్థాయి ఎలా ఉండనుందో క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో రూరల్ బ్యాక్ డ్రాప్లో ఫస్ట్ సింగిల్ అంటే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి!

అలాగే, ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం రక రకాల హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదట కాజల్ అగర్వాల్ను అనుకున్నారనే టాక్ వచ్చింది.

►ALSO READ | Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..

ఆ తర్వాత పుష్ప సినిమాల్లో కిసిక్స్ పాటతో అందరినీ అలరించిన ఎనర్జిటిక్ భామ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఆమె దాదాపుగా ఖాయమైందనే వాదన కూడా బలంగా వినిపించింది. కానీ, ఇప్పుడు లేటెస్ట్గా బుట్టబొమ్మ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూజా హెగ్దేతో ఈ పాట చేయిద్దామనే ప్లాన్లో ఉన్నారట మేకర్స్. 

దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప్ర‌జెంట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. 27 మార్చి 2026న థియేటర్లలో విడుదల కానుంది.