
ప్రముఖ మ్యాగజైన్ ‘ది షిఫ్ట్’ ప్రకటించిన ప్రభావంతమైన మహిళల జాబితాలో దీపిక నిలిచారు. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించారు 'ది షిఫ్ట్' మ్యాగజైన్. ఈ ప్రెస్టీజియస్ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖ హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ప్రముఖులు ఉన్నారు.
అయితే, భారతదేశం నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపికా పదుకొనే చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతీయ సినీ ప్రపంచానికి ఒక గొప్ప గుర్తింపు. ఇక ఇదే గౌరవం బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి నటులకు ఇప్పటి వరకు దక్కకపోవడం గమనార్హం.
దీపిక తన అంతర్జాతీయ గుర్తింపు, ప్రత్యేకతతో ఈ ఘనతను అందుకోవడంతో తన స్థాయిని మళ్లీ నిరూపించుకుంది. నటిగా దాదాపు 20 ఏళ్లుగా రాణిస్తున్న దీపిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. మరికొన్ని హిందీ మూవీస్ లో నటిస్తుంది.