Ram Charan : 'పెద్ది' నుంచి బిగ్ అప్డేట్ .. 1000 మంది డ్యాన్సర్లతో రామ్ చరణ్ ఎంట్రీ సాంగ్!

Ram Charan : 'పెద్ది' నుంచి బిగ్ అప్డేట్ .. 1000 మంది డ్యాన్సర్లతో రామ్ చరణ్ ఎంట్రీ సాంగ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు వినాయక చవితి పండుగ సందర్భంగా ఊహించని శుభవార్త అందింది. యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రం నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఈ రోజు నుంచి సినిమాలోని ఒక కీలకమైన పాట చిత్రీకరణ ప్రారంభమైందని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

చరణ్ తొలి సాంగ్ షూటింగ్!
'పెద్ది' చిత్ర బృందం వెల్లడించిన ప్రకారం, ఈ రోజు నుంచి సినిమాలోని ఒక కీలకమైన పాట చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సాంగ్‌కు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నృత్యాలను సమకూరుస్తున్నారు. రామ్ చరణ్, జానీ మాస్టర్ కాంబినేషన్‌కు అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. జానీ మాస్టర్ మాస్ స్టెప్పులు, చరణ్ ఎనర్జీ ఒకటయితే థియేటర్లలో ప్రేక్షకులకు పండగే అని చెప్పొచ్చు.

దాదాపు 1000 మంది డ్యాన్సర్లులతో పాట
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సాంగ్ సినిమాలోని హీరో ఎంట్రీ సాంగ్ అని తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. ఈ పాటకు దాదాపు 1000 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఇది సినిమాలోని అత్యంత గ్రాండ్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని, తన కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

►ALSO READ | బిగ్‌బాస్‌ ఫైనల్ అగ్నిపరీక్ష.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం రచ్చ రచ్చ!.. సర్ప్రైజ్ఇచ్చిన నాగార్జున!

 మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. 'పెద్ది' సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో, బుచ్చిబాబు తన రెండో సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా రామ్ చరణ్‌కు మరో బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.