సల్మాన్‌‌‌‌‌‌‌‌తో మెగా దోస్తీ

సల్మాన్‌‌‌‌‌‌‌‌తో మెగా దోస్తీ

హీరోగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ఇటీవలే పదిహేనేళ్లు పూర్తయ్యింది. ఈ పదిహేనేళ్లలో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ స్టార్స్‌‌‌‌‌‌‌‌  వరుసలో నిలిచాడు చరణ్. ఈ ఏడాది వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో హీరోగా తన స్థాయి మరింత పెరిగింది. ఈ క్రమంలో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌కు మరింతగా చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తోన్న చరణ్, మరోవైపు సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ మూవీలో కనిపించబోతున్నాడు. సల్మాన్ హీరోగా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో చరణ్ గెస్ట్ రోల్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్న విషయాన్ని ‘గాడ్‌‌‌‌‌‌‌‌ ఫాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ మూవీ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో సల్మాన్ రివీల్ చేశాడు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒకరోజు చరణ్ సెట్‌‌‌‌‌‌‌‌కు వచ్చి నటిస్తానని చెప్తే, జోక్‌‌‌‌‌‌‌‌ చేశాడనుకున్నాడట సల్మాన్. కానీ నెక్స్ట్ డే షూటింగ్‌‌‌‌‌‌‌‌కి తమకంటే ముందుగా కాస్టూమ్స్‌‌‌‌‌‌‌‌, కారవ్యాన్‌‌‌‌‌‌‌‌తో సహా వచ్చి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేశాడట చరణ్.  అలా ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి చరణ్ వచ్చాడని, తనతో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ అని చెప్పాడు సల్మాన్. ఆల్రెడీ వెంకటేష్‌‌‌‌‌‌‌‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తుండగా ఇప్పుడు చరణ్ కూడా యాడ్ అయ్యాడు. అయితే తను కేవలం ఓ పాటలో మాత్రమే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో సల్మాన్ నటించిన ఓ సినిమాకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పాడు చరణ్. ఇక చిరంజీవి హీరోగా వస్తోన్న ‘గాడ్‌‌‌‌‌‌‌‌ ఫాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో సల్మాన్ కీరోల్‌‌‌‌‌‌‌‌లో నటించాడు. మొత్తానికి సల్మాన్‌‌‌‌‌‌‌‌తో మెగా దోస్తీ కొనసాగుతోంది.