చరణ్ కు 'ట్రూ లెజెండ్' అవార్డు.. చిరు ట్వీట్

చరణ్ కు 'ట్రూ లెజెండ్' అవార్డు.. చిరు ట్వీట్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్' అవార్డును అందుకున్నారు. ఈ అవార్టును వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఓ జాతీయ మీడియా సంస్థ అందిస్తోంది. ఇందులో భాగంగా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో చరణ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో చరణ్‌ కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చరణ్ కు తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'నాన్నా..ట్రూ లెజెండ్ అవార్డును గెలుచుకున్న నిన్ను చూసి చాలా గర్విస్తున్నా. ఇలాగే ముందుకు సాగిపోవాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేశారు. చరణ్ చిన్ననాటి ఫొటోను కూడా చిరు షేర్ చేశారు.