Peddi Movie: రామ్ చరణ్ 'పెద్ది' కథ అదేనా? పీఎం మోదీకి వివరించిన అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది!

Peddi Movie: రామ్ చరణ్ 'పెద్ది' కథ అదేనా? పీఎం మోదీకి వివరించిన అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.  లేటెస్ట్ గా ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకుంటూ.. అది ఈ సినిమాతో ఎలా కనెక్ట్ అయిందో వివరించారు.

‘పెద్ది’ కథ ఏమిటంటే?

రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను ఢిల్లీలో మోదీ గారిని కలిసినప్పుడు, ఆయన నన్ను ‘పెద్ది’ సినిమా దేని గురించి అని అడిగారు. నేను ‘వికసిత్ భారత్’  అయిన గ్రామాల్లో సాధికారత (Empowerment of villages) గురించి అని చెప్పాను. అప్పుడు ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన ఒక అద్భుతమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక చిన్న గ్రామంలో చాలా మంది ఫుట్‌బాల్ జెర్సీలు వేసుకోవడం మోదీ గారు గమనించారట. 

దానికి కారణం.. అదే ప్రాంతానికి చెందిన ‘మహమ్మద్’ అనే వ్యక్తి భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడి, ఆ ఊరిలోని యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈరోజు ఆ ఒక్క పల్లెటూరు నుండి ఏకంగా 85 మందికి పైగా ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఒక్క వ్యక్తి అనుకుంటే ఎంతటి మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఇదే నిదర్శనం. మా ‘పెద్ది’ సినిమా కూడా ఒక గిరిజన ప్రాంతానికి చెందిన అలాంటి ఒక యువకుడి కథే" అని ప్రధానికి వివరించినట్లు చరణ్  ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.

యూఎస్‌లో అడ్వాన్స్ రికార్డులు

మరోవైపు, బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్  రికార్డులు సృష్టిస్తుంది. నార్త్ అమెరికా (US) మార్కెట్‌లో రామ్ చరణ్ తన గ్లోబల్ స్టార్ స్టామినాను మరోసారి నిరూపించుకుంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ యూఎస్‌లో కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే సుమారు 17,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా 481.5K డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ అన్నీ కలుపుకుంటే, ఇప్పటివరకు దాదాపు 18,900 టిక్కెట్లతో రూ. 4.4 కోట్లకు పైగాభారీ వసూళ్లను రాబట్టింది.

జూన్ 3న ప్రీమియర్స్!

వృద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. జూన్ 3న ఓవర్సీస్ ప్రీమియర్స్ పడబోతుండగా, జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రచ్చ లేపడానికి ‘పెద్ది’ సిద్ధమయ్యాడు...