డాన్స్ విషయంలో నాన్నను డామినేట్ చేయను

డాన్స్ విషయంలో నాన్నను డామినేట్ చేయను

‘ఆర్ఆర్ఆర్’ కోసం ‘నాటు నాటు’ అంటూ ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి డ్యాన్స్ చేసిన రామ్‌‌‌‌‌‌‌‌ చరణ్‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు ‘ఆచార్య’ కోసం తండ్రి చిరంజీవితో కలిసి స్టెప్పులేశాడు. ‘డ్యాన్స్ విషయంలో నాన్నను డామినేట్ చేయను.. అలాగని తగ్గను కూడా’ అంటున్నాడు చరణ్. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన ‘భలే భలే బంజారా’ అనే పాటను ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 18న విడుదల చేయబోతున్నట్లు నిన్న అనౌన్స్ చేశారు. అంతేకాదు.. ఈ పాట షూటింగ్ గురించి చిరు, చరణ్, కొరటాల శివ మధ్య జరిగిన సరదా డిస్కషన్‌‌‌‌‌‌‌‌ను కూడా వీడియో రూపంలో విడుదల చేశారు. ‘నాటు నాటు’ సాంగ్‌‌‌‌‌‌‌‌లో తారక్, చరణ్ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌  ఇరగ్గొట్టాక.. చరణ్‌‌‌‌‌‌‌‌తో నేను డ్యాన్స్ చేయడమంటే ఆ అంచనాలకు నేను రీచ్ అవ్వాలిగా’ అని చిరంజీవి అంటే.. ‘మేమెంత నాటుగా చేసినా నాన్న తన గ్రేస్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌‌‌‌‌తో మమ్మల్ని పక్కన పెట్టేస్తారు’ అన్నాడు చరణ్. కొరటాల వెళ్లిపోగానే.. ‘ఏం చరణ్‌‌‌‌‌‌‌‌... సాంగ్‌‌‌‌‌‌‌‌లో నన్ను డామినేట్ చేద్దామని చూస్తున్నావా... నీ బాబునురా నేను’ అంటూ నవ్వారు చిరంజీవి. అందుకు బదులిస్తూ ‘డామినేట్ చేయను కానీ.. తగ్గను కూడా డాడీ.. మీ ట్రైనింగ్ నుంచి వచ్చిన వాడిని కదా.. తగ్గితే బాగోదు’ అంటూ రిప్లై ఇచ్చాడు చెర్రీ. ‘ఇక కబుర్లెందుకు సెట్స్‌‌‌‌‌‌‌‌లో చూసుకుందాం’ అంటూ చరణ్‌‌‌‌‌‌‌‌కి చాలెంజ్ విసిరారు చిరంజీవి. మరి వీరిద్దరి మెగా గ్రేస్‌‌‌‌‌‌‌‌ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే. మరోవైపు ఈ నెల 23న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ని ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీనికి ఏపీ సీఎం జగన్‌‌‌‌‌‌‌‌ ముఖ్య​ అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది.