రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్

రామ్ చరణ్ కు  గౌరవ డాక్టరేట్

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును అందుకున్న రామ్ చరణ్.. మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ కళా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు గౌరవ డాక్టరేట్‌‌ను ప్రకటించింది. ఈనెల 13న జరగనున్న యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టరేట్‌‌ను అందుకో నున్నాడు. రామ్ చరణ్‌‌కు ఈ గౌరవం దక్కడంపై  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్‌‌ ఛేంజర్‌‌‌‌’లో నటిస్తున్న చరణ్.. మరోవైపు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నాడు.