
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన యాక్షన్ డ్రామా మూవీ ‘రంగస్థలం’(Rangasthalam). సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నాన్ బాహుబలి క్యాటగిరిలో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ లోని చరణ్ సహజ నటన..ప్రతి ప్రేక్షకుడుని కట్టి పడేసింది. తాజాగా రంగస్థలం నేడు (జూలై14న) జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం రిలీజ్ అయ్యింది. ఈ మూవీతో పాటు ఇండియన్ బ్లాక్ బస్టర్ KGF1, KGF2 చిత్రాలు కూడా నేడు రిలీజ్ అయ్యాయి.
ఇక జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGFయశ్ కంటే చరణ్ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రంగస్థలం 2.5 మిలియన్ యాన్స్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు చరణ్.
2018 లో రిలీజైన రంగస్థలం మూవీ 216 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసేందే. ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర’ మూవీ జపాన్ బాక్స ఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించుకోగా..ఇప్పుడు ఆ ప్లేస్ ని రంగస్థలం ఆక్రమించింది. దీంతో జపాన్ ఇండస్ట్రీను సైతం కలెక్షన్స్ తో దుమ్మురేపుతున్న రంగస్థలం మూవీ ముందు ముందు మరిన్నీ సంచలనాలు క్రియేట్ చేస్తుందని సినీ వర్గాల సమాచారం.