PEDDI Premieres Ticket Price: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ హైప్ నెలకొంది. అమెరికాలో కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు ట్యాక్స్‌తో కలిపి 40-42 డాలర్ల (దాదాపు రూ.4 వేల) వరకు చేరడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్‌లో అధిక టికెట్ ధరలు సాధారణమే అయినప్పటికీ, ‘పెద్ది’ రేట్లు సామాన్య ప్రేక్షకులకు భారంగా మారాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి విదేశాల్లో ప్రీమియర్ షో టికెట్ ధర ఎంత ఉంది? రేట్లు పెరిగినప్పటికీ, ఫ్యాన్స్ లో ఎలాంటి సందడి మొదలైంది? అనే వివరాలు తెలుసుకుందాం.
రేపు బుధవారం జూన్ 3న విదేశాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. యూకే, ఐర్లాండ్‌లో పెద్ది ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. గ్రాండ్ ప్రీమియర్స్ కోసం ఇప్పటికే 20,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఇంకా కొనసాగుతుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూకే, ఐర్లాండ్ విడుదలను నిర్వహిస్తున్న సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. విడుదలకు ముందే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవ్వడంతో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
Mega Power Star Is Moving Like A Storm 💥#PEDDI UK Premieres 20000+ Tickets Sold and Counting 🔥
— Prathyangira Overseas (@PrathyangiraOS) June 2, 2026
🎟️ https://t.co/FSeGDLZjPI
UK and Ireland By @PrathyangiraOS, Grand PREMIERES On 3rd JUNE 💥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/aLuIxzYF1A
‘పెద్ది' ప్రీమియర్ టికెట్ ధర 42 డాలర్లా?
ఈ సందర్భంగా తెలుగు ప్రీమియర్ షోల కోసం మేకర్స్ ప్రత్యేక టికెట్ ధరలను నిర్ణయించారు. యూఎస్ థియేటర్లో స్టాండర్డ్ 2D ప్రీమియర్ టికెట్లు 25 డాలర్ల వరకు (రూ.2360లు) ఉండగా, ప్రీమియం ఫార్మాట్లకు అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. మొదటి వారం రెగ్యులర్ షోల టికెట్ ధరలు 18 నుంచి 20 డాలర్ల మధ్య ఉండనున్నాయని సమాచారం. PLF స్క్రీన్లకు $2 నుంచి $5 డాలర్ల వరకు అదనపు ఛార్జీలు వర్తిస్తాయని మేకర్స్ తమ X ఖాతాలో వెల్లడించారు. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్లకు ప్రత్యేక ప్రీమియర్లు ఉండవని కూడా స్పష్టం చేసింది.
#PEDDI 🚨
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 10, 2026
North America Ticket Pricing - Official Update
TELUGU:
Premieres June 3rd Wednesday:
Standard 2D: $25 / $20
PLF: $5 extra
Speciality Formats: $7-$10 extra
Week 1 :
Standard 2D: $20 / $18
PLF: $2-$5 extra
Speciality Formats: $7-$10 extra…
అయితే ఈ భారీ హైప్ మధ్య కొన్ని థియేటర్లలో 'పెద్ది' ప్రీమియర్ టికెట్ ధర $38 (డాలర్లు) అని టాక్ కూడా ఉంది. ట్యాక్స్, ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు అన్నీ కలిపితే $40 నుంచి $42 వరకు వెళ్తుందని క్రిటిక్స్ చెబుతున్నారు. అంటే ఒక్క ప్రీమియర్ టికెట్టు ధర రూ.3,965 (42 డాలర్లు) అంటే చాలా ఎక్కువ.
ప్రస్తుతం ఈ విషయం మీద సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఈ క్రమంలోమనే ఓ తెలుగు సినీ అభిమాని చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.‘ఇది RRRనా? లేక బాహుబలి 2 హ? 40 డాలర్లు టికెట్ పెట్టేంత మాగ్నమ్ ఓపస్ మూవీనా?’ అంటూ ప్రశ్నించారు.
అమెరికాలో కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు ట్యాక్స్‌తో కలిపి 40-42 డాలర్ల (దాదాపు రూ.4వేల) వరకు చేరడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. “ఇది RRRనా? బాహుబలి 2నా?” అంటూ ఓ తెలుగు సినీ అభిమాని కొన్ని రోజుల కిందట ఓ వీడియో కూడా రిలీజ్ చేసి పరిస్థితి చెప్పుకోచ్చాడు.
ఈ విమర్శలపై ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా స్పందించింది. "ప్రతి థియేటర్‌కి కావలసిన ధరలు ఉంటాయి. PLF, D-BOX, IMAX వంటి స్పెషల్ ఫార్మాట్‌లకు అదనపు ఛార్జీలు ఉంటాయి. ట్యాక్స్‌లు రాష్ట్రాలు వారీగా మారుతాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఫీజులు కూడా కలుస్తాయి" అని వివరణ ఇచ్చింది. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్ కారణంగా టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా కూడా బుకింగ్స్ మాత్రం వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ‘పెద్ది’ ప్రీమియర్స్ రేట్..
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పెద్ది’ చిత్ర ప్రీమియర్ షోలకు అధికారిక అనుమతి మంజూరు చేసింది. విడుదలకు ఒక రోజు ముందుగా, అంటే జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ ప్రీమియర్ షోల టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించారు.
అలాగే, జూన్ 4న సినిమా విడుదలైన తర్వాత, రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా చిత్ర బృందానికి ప్రత్యేక అనుమతి లభించింది. దీంతో విడుదల రోజున ‘పెద్ది’కి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
