Ram Gopal Varma: పబ్లో అమ్మాయితో ఆర్జీవి చిల్..నా గెలుపు పార్టీ 100 రెట్లు పెద్దది

Ram Gopal Varma: పబ్లో అమ్మాయితో ఆర్జీవి చిల్..నా గెలుపు పార్టీ 100 రెట్లు పెద్దది

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇండస్ట్రీ డైరెక్టర్స్లో తన స్టయిలే వేరే. ఈ ప్రపంచంలో ఒక మనిషి ఎలా ఉండాలో..అంతకు మించిన ఆలోచనతో బతికేస్తుంటాడు. ఆయన తీసే సినిమాలు ఎలాంటివో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ మేకర్స్ కి తెలుసు. నిజ జీవిత ఆలోచన శైలి అనేది.. అయన రాసుకున్న నా ఇష్టం పుస్తకం చూస్తే తెలిసిపోతుంది. ఇక కొన్ని సార్లు అతని మాటలు..అతని ఆలోచనలు ఎవ్వరికీ అర్ధం కాకుండా కూడా ఉంటాయి. అందుకే వర్మ స్టయిలే వేరే. 

లేటెస్ట్గా వర్మ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా చేసిన వీడియో పోస్ట్ ఆకట్టుకుంటోంది. పబ్లో ఓ అమ్మాయితో సరదాగా డ్యాన్స్ చేస్తూ..తనదైన రొమాంటిక్ లుక్స్తో చూస్తూ..వీడియోకి పెట్టిన ఆర్జీవి ట్యాగ్ వైరల్ అవుతోంది. 

వ్యూహం సినిమా రిలీజ్ పోస్ట్పోన్తో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. కానీ, నువ్వు సాధించిన విజయం కంటే..నా గెలుపు పార్టీ 100 రెట్లు పెద్దది అంటూ..నారా లోకేష్కి ట్వీట్ ట్యాగ్ చేశాడు. నారా లోకేష్కు నిద్ర లేకుండా చేయడమే..వర్మ విజయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.   

ప్రస్తుతం ఆర్జీవికి సంబంధించిన ఈ పోస్ట్ తో పాటు..ప్రతి ఏడాది గతేడాది మాదిరిగానే ఉంటుంది. ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని లేని పోనీ అపోహలు ఉంటే..ఇక మీ కర్మ' అని గతంలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.