అంబర్​పేట బాలుడి కుటుంబానికి సాయం చేద్దాం మేయర్: ఆర్జీవీ

అంబర్​పేట బాలుడి కుటుంబానికి సాయం చేద్దాం మేయర్: ఆర్జీవీ

అధికారిక హోదాలో మీరు ఏం చేయలేకపోతే.. కనీసం వ్యక్తిగత హోదాలోనైనా అంబర్​పేట బాలుడి కుటుంబానికి సాయం చేయాలని సీని దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ గ్రేటర్ ​హైదరాబాద్​ మేయర్​గద్వాల విజయలక్ష్మిని కోరారు. డాగ్​లవర్ అయితే సరిపోదని.. తోటి మనుషులను కూడా ప్రేమించాలని మేయర్​ను ట్యాగ్​చేస్తూ  వర్మ ఇవ్వాల ఉదయం వరుస ట్వీట్లు ​చేశారు. బాలుడు ప్రదీప్​కుటుంబానికి తోటి పౌరులమైన మనం కూడా చేయూతనివ్వాలని, దయ కలిగిన వారు ఎవరైనా ఉంటే ప్రదీప్ ​తల్లిదండ్రుల జాయింట్​అకౌంట్​కు డబ్బు పంపి సాయం చేయాలని నగర ప్రజలను కోరారు. కాగా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోందని ఆర్జీవీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.