22న సోమవారం బ్యాంకులకు సెలవు ఉందా లేదా..!

22న సోమవారం బ్యాంకులకు సెలవు ఉందా లేదా..!

అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది.. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉదయం పూట అధికారికంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. మధ్యాహ్నం నుంచి ఆఫీసులు పని చేయనున్నాయి.. ఇదంతా సరే.. ఆ రోజు అంటే జనవరి 22వ తేదీన బ్యాంకులు పని చేస్తాయా లేదా.. బ్యాంకులు ఉంటాయా లేదా.. బ్యాంకులకు సెలవు ఉందా లేదా.. ఉంటే సగం రోజు ఉంటుందా.. మధ్యాహ్నం నుంచి బ్యాంకులు ఓపెన్ అవుతాయా.. ఈ విషయాలపై  క్లారిటీ ఇవ్వలేదు బ్యాంకులు. 

కేంద్రం బాటలోనే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అర పూట సెలవు ఇచ్చాయి. ఇందులో రాజస్థాన్, త్రిపుర, ఓడిశా, గుజరాత్, అసోం రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే విధంగా బ్యాంకులు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

సగం రోజు సెలవు అంటే.. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆఫీసులు పని చేస్తాయి. ఇళ్ల దగ్గర అయోధ్యలోని రాములోరి విగ్రహ ప్రతిష్ట చూసి.. భోజనాలు చేసి ఆఫీసులకు వస్తారన్న మాట. ఆ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని ఇప్పటికే హిందూ సంస్థలు ప్రకటించాయి.. అయోధ్య రాములోరి కోసం ఆ రోజు బ్యాంకులు సెలవు ఇస్తాయా లేదా.. సగం రోజు అయినా అనేది ఇప్పుడు కస్టమర్లకు వస్తున్న ప్రశ్నలు..