‘రెడ్‘ గా మారిన ఇస్మార్ట్ శంకర్

‘రెడ్‘ గా మారిన ఇస్మార్ట్ శంకర్

ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్తగా ట్రై చేస్తూ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు. ఆ సినిమాలో చాలా ఢిఫరెంట్ గా ఉన్న రామ్ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేస్తున్న తర్వాతి సినిమా రెడ్. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో స్రవంతి రవికిషోర్ బ్యానర్ పై ఈ సినిమా వస్తుంది. కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ ఇది. ఇంతకుముందు నేనుశైలజ, ఉన్నది ఒక్కడే జిందగీ వచ్చాయి.

రెడ్ మూవీకి సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో  రిలీజ్ చేశాడు రామ్.  తన 18 వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో కూడా రామ్  మాస్ లుక్ తో రఫ్ గా ఉన్నాడు.  ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.