Andhra King Taluka X Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Andhra King Taluka X Review:  ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్రకింగ్ తాలూకా’(Andhra King Taluka). కన్నడ రియల్ స్థార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. పి.మహేష్ బాబు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. ఇవాళ గురువారం (2025 నవంబర్ 27న) ప్రపంచవ్యాప్తంగా మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

‘తన కెరీర్ లోనే మోస్ట్ పర్సనల్ సినిమా అని, ఎప్పటినుంచో తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఇందులో ఉన్నాయని’ హీరో రామ్ ప్రమోషన్లలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాతో గట్టి కొట్టాలని కసితో ప్రమోషన్స్లో దూకుడు కొనసాగించారు. ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబల్ ఇస్మార్ట్’ వంటి వరుస ఫెయిల్యూర్స్తో రామ్ సంతమవుతున్నారు. ఈ క్రమంలో భారీ అంచనాలతో ‘ఆంధ్రకింగ్ తాలూకా’తో వచ్చిన ఉన్న రామ్కి ఎలాంటి హిట్ పడింది? ఈ సినిమాతో రామ్ కం బ్యాక్ ఇచ్చినట్టేనా? లేదా? అనేది X (ట్విట్టర్) టాక్లో తెలుసుకుందాం. 

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పబ్లిక్ టాక్:

రామ్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 22వ సినిమా. ఈ మూవీలో కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్రకు రామ్‌ వీరాభిమానిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై పిచ్చి ప్రేమతో ఉన్న కుర్రాడి, లైఫ్ లోకి తన అభిమాన హీరో వస్తే, కథ ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఆంధ్రా కింగ్ మెయిన్ స్టోరీ. 

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీకి ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా బాగుందని సోషల్ మీడియా ద్వారా రివ్యూలు షేర్ చేస్తున్నారు. చాలా  కాలం తర్వాత హీరో రామ్ తనదైన లవ్ స్టోరీతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించాడని అంటున్నారు. ఎమోషనల్ అండ్ లవ్ స్టోరీతో రామ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘హీరో ఇంట్రడక్షన్ సీన్, లవ్ ట్రాక్, బనానా ఫైట్, డైలాగ్స్, నువ్వుంటే చాలే సాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్..’’ పాజిటివ్ అంశాలుగా ఉన్నాయని ఓవర్సీస్ ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఓ నెటిజన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. ‘‘ఆంధ్రా కింగ్ తాలూకా ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్. రామ్ పోతినేని తన అత్యుత్తమ నటనను కనబరిచాడు. ఆకట్టుకునే డైలాగ్స్తో డైరెక్టర్ మహేష్ బాబు సాలిడ్ రైటింగ్తో వచ్చి హిట్ కొట్టారు. మనసుని ఆకట్టుకునే పాటలు, సెకండాఫ్ క్లైమాక్స్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అక్కడక్కడా స్లోగా సాగుతుంది. అదొక్కటే మైనస్. మిగతా సినిమా మొత్తం ఫీల్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్.. రామ్ ఖాతాలో కం బ్యాక్ ఫిల్మ్.. ఆంధ్రా కింగ్ తాలూకా’’ అని తన రివ్యూ షేర్ చేశాడు. 

మరో నెటిజన్ రివ్యూ షేర్ చేస్తూ..‘‘ఆంధ్రా కింగ్ తాలూకా సంతృప్తినిచ్చే ఫ్యానిజం మూవీ . లవ్ స్టోరీతో వచ్చి రామ్ మెప్పించాడు. కథ కొంచెం ఊహించినట్టుగా, అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. డీసెంట్ ఫీల్ కలిగిస్తుంది. ఫ్యాన్ ట్రాక్ అలాగే ప్రేమ కథని డైరెక్టర్ మహేష్ చాలా చక్కగా సింక్ చేశాడు. అందులో భాగంగా వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. డైరెక్టర్ మహేష్ బాబు మరో ఫీల్ గుడ్ ఎమోషన్స్తో కూడిన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడని. అయితే, కథలో నెరేషన్ ఇంకాస్త గ్రిప్పింగ్గా రాసుకుంటే ఇంకా బాగుండేదని తెలిపాడు. రామ్ తన ఎనర్జీతో సాగర్ పాత్రని ఈజీగా క్యారీ చేశాడని, ఉపేంద్ర కూడా స్టార్ హీరో పాత్రకి న్యాయం చేశాడని అలాగే రావు రమేష్ కూడా బాగా చేశాడని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తో హీరో రామ్ జెన్యూన్ అటెంప్ట్ చేసినట్లు ’’ రివ్యూ ఇచ్చాడు.