RAPO22: రామ్ కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. అంచనాలు పెంచేలా టైటిల్ గ్లింప్స్

RAPO22: రామ్ కొత్త సినిమా  ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. అంచనాలు పెంచేలా టైటిల్ గ్లింప్స్

రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నేడు గురువారం మే15న రామ్ బర్త్ డే స్పెషల్గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాంతో పాటు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’అని టైటిల్ కన్ఫార్మ్ చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్.. 'సమ్‌‌‌‌థింగ్ ఫ్రెష్, న్యూ అన్‌‌‌‌టోల్డ్ స్టోరీని ఎక్స్‌‌‌‌పీరియెన్స్' చేయబోతున్నాం అనేలా కొత్తగా ఉంది. 

గ్లింప్స్ స్టార్ట్ అవ్వగానే థియేటర్.. ఫ్యాన్స్ ఈలలు, కేకలు, టికెట్ల కోసం బారులు.. ఇలా ఫ్యాన్స్ మూమెంట్ సందడితో మొదలైంది. అక్కడ టికెట్ల ఇచ్చే వ్యక్తితో తమ పలుకు బడిని వాడటం.. ఎమ్మెల్యే, పోలీస్ తాలుకా అంటూ టికెట్లు తీసుకుంటూ ఉండటం..ఆసక్తి రేపింది. టికెట్ ఇచ్చేవాడు ఆంధ్రా కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా? అని చెప్పడం.. ఆ తర్వాత మన హీరో రామ్ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి.. ఆంధ్ర కింగ్ తాలుకా అని యాభై టికెట్లు తీసుకోవడవం వంటివి అంచనాలు పెంచింది.

అలా టికెట్లని తీసుకుని స్టైల్ గా నడుస్తూ.. పెద్ద కటౌట్ వైపు వెళుతూ.. అందని వాడు.. అందరివాడు.. మన సూర్య కుమార్. మన సూపర్ స్టార్ అంటూ ఆంధ్ర కింగ్ తాలూకా అని గట్టిగా అరవడం క్రేజీ ఫ్యాన్స్ బాయ్ మూమెంట్ ను గుర్తుచేస్తోంది. మేకర్స్ చెప్పినట్టుగా నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోపిక్‌లానే అనిపిస్తోంది. రామ్ కు సరైన సినిమా పడిందనే విషయం చెప్పడానికి ఈ సింగిల్ గ్లింప్స్ చాలు. ఇక టీజర్, ట్రైలర్ వస్తే.. మరిన్ని అంచనాలు పెరగడం మాత్రం కన్ఫార్మ్.

ప్రస్తుతం రామ్.. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్నాడు. ‘ది వారియర్’, ‘స్కంద’ , ‘డబల్ ఇస్మార్ట్’ మూవీలు భారీ డిజాస్టర్స్  అందుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీతో స్ట్రాంగ్ హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే తన అసలైన లవర్ బాయ్ యాంగిల్ నే ఎంచుకున్నాడు. పూర్తిగా మాస్ నుంచి బయటకు వచ్చి లవ్ స్టోరీ చేస్తున్నాడు. 

ఇకపోతే ఈ మూవీని భారీ స్థాయిలోమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 'మిస్ శెట్టి 'మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి మహేష్ బాబు తెరకెక్కిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. స్టార్ హీరో కం డైరెక్టర్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు వెల్ కమ్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రంతో టాలీవుడ్‌‌కు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ పరిచయం అవుతున్నారు. తమిళనాట ఇప్పటికే పలు చిత్రాలకు వర్క్ చేసిన వివేక్, మెర్విన్ సంగీత ద్వయం మ్యూజిక్ అందించబోతున్నారు. వీళ్లిద్దరి అసలు పేర్లు వివేక్ శివ, మెర్విన్ సాల్మన్. ‘వడా కర్రీ’ అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించి ధనుష్ ‘పటాస్’, ప్రభుదేవా ‘గులేబకావళి’, కార్తి ‘సుల్తాన్’ చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు.