రామబాణం మూవీ రివ్యూ.. హ్యాట్రిక్ కాంబో రిజల్ట్ ఏంటో?

రామబాణం మూవీ రివ్యూ..  హ్యాట్రిక్ కాంబో రిజల్ట్ ఏంటో?

మ్యాచో హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న  హ్యాట్రిక్ మూవీ రామబాణం. అవుట్ అండ్ అవుట్  ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా.. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రీమియర్స్ అండ్ మార్నింగ్ షోస్ నుండి వినిపిస్తున్న  టాక్ ఎలా ఉందో ఒకసారి  చూద్దాం.  రామబాణం కథ గురించి చెప్పాలంటే.. విలువలు, నియమాలు పద్దతులతో బ్రతికే ఒక అందమైన ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబాన్ని విలన్ డిస్ట్రబ్ చేస్తాడు. అప్పుడు  హీరో ఏం చేస్తాడు? విలన్స్ ని ఎలా ఆట కట్టిస్తాడు అనేది మిగతా కథ.

నిజానికి ఇది పాతచింతకాయ పచ్చడి కథే.  గత కొన్నేళ్లుగా చాలా మంది దర్శకులు వాడేసిన మాస్ కమర్షియల్ సబ్జెక్టు. ఇప్పుడు శ్రీవాస్ కూడా ఇదే కథతో ఆడియెన్సుని మెప్పించే ప్రయత్నం చేశారు.  నిజానికి శ్రీవాస్, గోపిచంద్ కాంబోపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి సక్సెస్ అయ్యాయి. అందుకే రామబాణం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఒక సారి వర్క్ అవుట్ అయిన ఫార్ములా,  కథ, కథనాలని మళ్ళీ రిపీట్ చేస్తే ఇలాగే ఉంటుంది. దర్శకుడు శ్రీవాస్ రెండు దశాబ్దాల క్రితం హిట్ సబ్జెక్టునే మళ్ళీ రిపీట్ చేశాడు.

రామబాణం అలాంటి సినిమానే అని ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నాడు. అవుట్ డేటెడ్ కథ, ఏ మాత్రం కొత్తదనం కథనాలు ఆడియన్స్ కి విసుగుపుట్టిస్తాయట. యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ వంటి కమర్షియల్ అంశాలు అసలు సెట్ కాలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడా పర్లేదు అనిపించిందట. ఇక హీరోయిన్ తో కెమిస్ట్రీ కూడా అంతంత మాత్రమేనని, గోపీచంద్ యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ వన్ లైనర్స్ పరవాలేదనిపించాయని, కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదంటున్నారు. దర్శకుడు శ్రీవాస్ మరోసారి ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయారన్నది ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. జగపతిబాబు, కుష్బూ, నాజర్, అలీ, వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్, సప్తగిరి వంటి భారీ స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో ఉన్నా..  వారిని పూర్తి స్థాయిలో దర్శకుడు వాడుకోలేదంటున్నారు.  మొత్తంగా రామబాణం గురితప్పింది మాట వినిపిస్తోంది.