రామబాణం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

రామబాణం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రామబాణం. శ్రీవాస్ డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అవుట్ డేటెడ్ కథతో వచ్చిన ఈ సినిమాకి మొదటి షో నుండే నెగిటీవ్ టాక్ వచ్చింది. దీంతో గోపిచంద్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా. డింపుల్ హయతి, జగపతిబాబు, ఖుష్బూ, నాజర్ వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నా కూడా పాత్రలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

కథా, కథానాల్లో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ సినిమాని రిజెక్ట్ చేశారు. నిజానికి.. శ్రీవాస్,గోపిచంద్ కాంబోకి మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘లక్ష్యం‘, ‘లౌక్యం‘ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే.. ఈ  కాంబో హ్యాట్రిక్ సక్సెస్ కోసం మళ్ళీ అదే ఫార్ములాని నమ్ముకోవడం పెద్ద మిస్టేక్ గా మారింది. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కులని సోనీ లీవ్ దక్కించుకుంది.

ఈ పరిస్థితిలో సినిమా థియేటర్స్ లో రన్ అవడం కష్టమే కాబట్టి.. మరికొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబధించిన పూర్తి వివరాలు సోనీ లీవ్ త్వరలోనే  వెల్లడించే అవకాశం ఉంది. మరి.. థియేటర్లలో ఆకట్టుకోలేని ఈ సినిమా.. కనీసం ఓటీటీలోనైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఇక ‘రామబాణం’ సినిమాను  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.