ఆర్ ఎఫ్ సీఎల్ లో తగ్గిన యూరియా ఉత్పత్తి.. మేతో పోలిస్తే జూన్ లో 13 వేల టన్నుల లోటు

ఆర్ ఎఫ్ సీఎల్ లో తగ్గిన యూరియా ఉత్పత్తి.. మేతో పోలిస్తే జూన్ లో 13 వేల టన్నుల లోటు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్​ఎఫ్​సీఎల్​ప్లాంట్​లో మే నెలతో పోలిస్తే జూన్ లో యూరియా ఉత్పత్తి తగ్గింది. మే లో 1,07,883 టన్నుల యూరియా ఉత్పత్తి కాగా, జూన్​లో 94,849 టన్నులే ఉత్పత్తి చేశారు. దీంతో ఒక్క నెలలోనే 13,034 టన్నుల యూరియా లోటు ఏర్పడింది. ఆర్​ఎఫ్​సీఎల్​లో డెన్మార్క్​కు చెందిన హల్దర్​టాప్స్ కంపెనీ సమకూర్చిన హై టెంపరేచర్​రీఫార్మర్​(హెచ్​టీఆర్​) మెషీన్ జనవరి నెలలో రిపేర్ కు వచ్చింది. ఈ మెషీన్ ను మార్చి 25న ప్లాంట్​నుంచి ముంబైకి తరలించారు. ఈ కారణం వల్లే యూరియా ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉండగా... ప్రస్తుతం రోజుకు మూడు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రభావం ఖరీఫ్ సీజన్ సాగుపై చూపనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.