
జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ ప్రాజెక్టులో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌లో భద్రతా సిబ్బందితో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహంచారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అనుకోని రీతిలో ప్రమాదాలు జరిగితే రక్షణదళాలు అప్రమత్తమై స్పందించాల్సిన తీరుపై మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు.
కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, అరవింద్ కుమార్ సీనియర్ కమాండెంట్, ఎస్ ఆంజనేయ రాజు, డిప్యూటీ కమాండెంట్, ఓవీకే శాస్త్రి- డిప్యూటీ కమాండెంట్, జై కన్వర్- అసిస్టెంట్ కమాండెంట్ ఆకేశ్వర్ సింగ్- తదితరులుఉన్నారు.