పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు

పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు

వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో ఉన్న పుట్ట మధును విడుదల చేశారు. పది రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న పుట్టా మధును మూడు రోజుల క్రితం రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రామగుండం తీసుకొచ్చి వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి ఆయనను రెండు రోజులపాటు ప్రశ్నించారు. అనంతరం సోమవారం అర్ధరాత్రి పోలీసులు మధును విడిచిపెట్టారు. తిరిగి మంగళవారం విచారణ నిమిత్తం కమిషనరేట్‌కు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

రామగుండం కమిషనరేట్‌లో మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్ పూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ సత్యనారాయణను అధికారులు రోజంతా విచారించారు. వామన్ రావు దంపతుల హత్య జరిగిన రోజు, అంతకు ముందు హంతకులు ఫోన్ ద్వారా ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడారనే కాల్ డాటా ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగించినట్లు తెలుస్తోంది.