ఓపెనింగ్ కు రెడీగా..రామగుండం రైల్వే స్టేషన్.. మే15న ప్రారంభం..

ఓపెనింగ్ కు రెడీగా..రామగుండం రైల్వే స్టేషన్.. మే15న ప్రారంభం..
  • అమృత్ ​భారత్ ​స్టేషన్ ​స్కీమ్ కింద డెవలప్ మెంట్
  • ఎయిర్ పోర్ట్ ను తలపించేలా రూ.26.49 కోట్లతో కొత్తరూపు 
  • గ్రాండ్ లుక్ తో ఎస్కలేటర్లు, వెయిటింగ్​ హాల్స్, 
  • టికెట్​ కౌంటర్లు 

గోదావరిఖని, వెలుగు: రామగుండం రైల్వే స్టేషన్​అభివృద్ధి పనులు చివరి దశకు చేరాయి. ఎలివేషన్, ఎస్కలేటర్స్, లిప్ట్​లు, వెయిటింగ్​హాల్స్, ల్యాండ్​ స్కేప్​, టిక్కెట్​ కౌంటర్లు, పెయింటింగ్స్, పార్కింగ్ వంటి  సౌకర్యాలు కల్పించగా.. గ్రాండ్​లుక్​తో ఎయిర్​పోర్టులా రూపుదిద్దుకుంది. ఈనెల15న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా స్టేషన్ ను ప్రారంభించనుండగా.. స్పీడ్ గా వర్క్స్ నడుస్తున్నాయి. అమృత్ ​భారత్​స్టేషన్​స్కీమ్​(ఏబీఎస్​ఎస్​) కింద కేంద్ర ప్రభుత్వం రూ.26.49 కోట్లతో పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్​ పనులను రెండేండ్ల కింద చేపట్టింది. ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుని ఓపెనింగ్ కు రెడీ అవుతోంది.  

ఆధునిక సౌకర్యాలు, ఆకట్టుకునే నిర్మాణాలు 

 రైల్వే స్టేషన్​ఎంట్రెన్స్ లో కాకతీయ కళాతోరణం దాటిన తర్వాత నుంచి వెల్ కమ్​పలికేలా నయా లుక్ తో నిర్మాణాలు చేపట్టారు. స్టేషన్ లోకి ప్రయాణికులు వెళ్లే రూట్ లో ఆకట్టుకునేలా ల్యాండ్​ స్కేప్​ను తీర్చిదిద్దారు. వెహికల్స్​ పార్కింగ్​కు మోడ్రన్ షెడ్లను నిర్మించారు. టిక్కెట్​కౌంటర్​ఏరియాను విస్తరించారు. రామగుండం ప్రాంతాన్ని గుర్తుచేసేలా పరిశ్రమలు, రాముని గుండాలు, ఇతర చారిత్రక ఘట్టాలతో పెయింటింగ్స్​వేశారు. 

ఎలివేషన్​పై తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్​లో  రామగుండం పేరును అమర్చారు. ప్రయాణికులు1వ ప్లాట్ ఫామ్ నుంచి 2 ప్లాట్ ఫామ్ పైకి వెళ్ల డానికి వీలుగా రెండు వైపులా మూడు ఎస్కలెట ర్లు, రెండు లిప్ట్​లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా ర్యాంప్​లు.. 12 మీటర్ల (40 ఫీట్లు) వెడల్పుతో ఫుట్​ఓవర్​బ్రిడ్జిని నిర్మించారు. స్టేషన్ లోపల జనరల్​వెయిటింగ్​హాల్, ఏసీ వెయిటింగ్​హాల్(గంటలకు రూ.30 చార్జి), వీఐపీ లాంజ్, 1వ, 2వ ప్లాట్​ఫామ్​లపై ఆకట్టుకునేలా సిట్టింగ్​ఏరియాను తీర్చిదిద్దారు.  

 ఇన్ కమ్ తేవడంలో కీలక స్టేషన్  

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే డివిజన్​లో రామగుండం రైల్వేస్టేషన్​ ఆదాయం తీసుకురావడంలో కీలకంగా ఉంది. సింగరేణి నుంచి బొగ్గు, ఆర్ఎఫ్​సీఎల్ ​ప్లాంట్​ నుంచి యూరియా రైల్వే వ్యాగన్ల ద్వారా ట్రాన్స్ పోర్ట్ అవుతుంది. ప్రతి రోజు సుమారు రూ.50 కోట్లకుపైగా ఇన్ కమ్ వస్తుంది. అదేవిధంగా స్టేషన్ లో  రోజు పలు ప్రాంతాలకు వెళ్లే 33 రైళ్లు ఆగుతుంటాయి. ప్రయాణికుల నుంచి రోజుకు సుమారు రూ.2.50 లక్షల దాకా ఆదాయం సమకూరుతుంది.