
వెంకటాపూర్(రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ ఐఎఫ్ఎస్ శ్రీకర్ రెడ్డి , బ్రూనై భారత హై కమిషన్ ఐఎఫ్ఎస్ అబ్బగాని రాము బుధవారం (సెప్టెంబర్ 03) సందర్శించారు. టూరిజం గైడ్ వారికి రామప్ప చరిత్ర, ఆలయ శిల్పకళా వైభవాన్ని వివరించారు.
ఈ సందర్భంగా వారు శిల్పకళ అద్భుతంగా ఉందని, కాకతీయుల వారసత్వ సంపదను ప్రతిబింబించే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు సత్కచించారు. భూపాల్ పల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, అధికారులు ఉన్నారు.