జనవరి 30 నుంచి మహా సాంస్కృతిక మహోత్సవం

జనవరి 30 నుంచి మహా సాంస్కృతిక  మహోత్సవం

హైదరాబాద్​ సిటీ, వెలుగు : ప్రఖ్యాత నర్తకి, పద్మశ్రీ డా. ఆనంద శంకర్ జయంత్ ఆధ్వర్యంలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు మాదాపూర్​సీసీఆర్‌టీ క్యాంపస్​లో రామాయణ కల్పవృక్షం పేరిట మహా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మద్దతుతో శంకరానంద కళాక్షేత్ర, నాట్యారంభ, బృహత్ క్రియేటివ్ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది.

ఇందులో భోపాల్ లిటిల్ బాలే థియేటర్ బొమ్మలాట రామాయణం, సందీప్ నారాయణ్ కర్ణాటక సంగీతం, సుజాత మోహపాత్రా-ప్రీతిషా ఒడిస్సీ, బుంగార్ ఖాన్ టీమ్​మాంగణియార్ ఫోక్, 'కర్ణాటిక్ 2.0' ఫ్యూజన్ ఎన్‌సెంబుల్ ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఉంటాయన్నారు. టికెట్లు, నమోదు కోసం www.ramayanakalpavrksam.com  వెబ్​సైట్​ను చూడాలని 9959154371 / 9963980259  నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.