ఎమ్మెల్యే భగత్ కృషితో తండాల అభివృద్ధి: రాంచంద్రనాయక్

ఎమ్మెల్యే భగత్ కృషితో తండాల అభివృద్ధి: రాంచంద్రనాయక్

హాలియా, వెలుగు:  ఎమ్మెల్యే నోముల భగత్ కృషితో సాగర్​ పరిధిలోని గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని ట్రైకార్ చైర్మన్, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ఇస్లావత్ రాంచంద్రనాయక్ చెప్పారు. బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన గిరిజన సంఘం నాయకుల మీటింగ్‌కు రాష్ట్ర నేత సాదం సంపత్ కుమార్‌‌తో కలిసి హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ గిరిజనులను ఓట్ బ్యాంకుగా చూసిందే తప్ప ఏనాడూ పట్టించుకోలేదన్నారు.

సీఎం కేసీఆర్‌‌ అధికారంలో వచ్చిన తర్వాతే తండాలు జీపీలుగా  మారాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హాలియాలో బంజారా భవన్ కోసం ఎకరం స్థలం కేటాయించడంతో పాటు రూ. 2 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఈ నెల 29న మంత్రి సత్యవతి రాథోడ్ సాగర్‌‌ పర్యటన సక్సెస్‌ చేయాలని కోరారు.  ఏఐబీఎస్​ఎస్​ సాగర్‌‌ అధ్యక్షుడు భిక్ష్య నాయక్, పాక్స్ జిల్లా డైరెక్టర్ జయరాం నాయక్, పార్టీ మండల అధ్యక్షులు రవి, బాలాజీ, ఎంపీటీసీ దానవత్ రవి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చందా, సర్పంచ్ సుశీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్ ఉన్నారు.

ALS0 READ: ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి: హనుమంతు