మెగా ప్రిన్సెస్ క్లిన్కారాకు ఆరు నెలలు..మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

మెగా ప్రిన్సెస్ క్లిన్కారాకు ఆరు నెలలు..మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan)-ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. వీరిద్దరూ జూన్ 20న ఆడబిడ్డకు జన్మనివ్వగా మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు.కాగా ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్  క్లిన్ కారాకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా ఉపాసన, చరణ్ ఎంతో జాగ్రత్త పడుతూ వస్తున్నారు. 

ఇదిలా ఉంచితే..నేటితో క్లిన్ కారా పుట్టి ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా..ఈ మెగా దంపతులు ముంబైలోని మహాలక్ష్మి టెంపుల్కి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఆ తర్వాత మెగా బృందంతో కిందకు దిగి వస్తుండగా..సడెన్గా మీడియా కంట పడ్డారు. ఫ్యాన్స్తో పాటుగా..మీడియా ఫోటోస్ కోసం ప్రయత్నించిన కానీ.. క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్తగా వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.