
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామికి ఆ పార్టీ నేత రామిల్ల రాధిక మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని INTUC ఆఫీస్ లో వెళ్లిన వివేక్ కు ఆమె తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తుందన్న రాధిక .. చెన్నూరులో వివేక్ వెంకటస్వామి గెలుపు ఖాయమని చెప్పారు.
also read :- చంద్రబాబుకు గుండె జబ్బు ఉంది : కోర్టుకు తెలిపిన లాయర్లు
ప్రతిపక్ష పార్టీ ప్యాకేజీలు ముట్టిన్నయ్ అంటూ అడపిల్లని అమ్మకానికి పెట్టినట్లు మాట్లాడుతున్నారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి ప్యాకేజీలు తీసుకోలేదని, అవాస్తవాలు మాట్లాడవద్దన్నారు. చెన్నూరు ప్రజల కోసం, వివేక్ వెంకటస్వామి గెలుపుకు పనిచేస్తానని రాధిక తెలిపారు.