నటి రమ్యకు ఆన్ లైన్ లో బెదిరింపుల కేసులో ఇద్దరు అరెస్ట్..

నటి రమ్యకు ఆన్ లైన్ లో బెదిరింపుల కేసులో ఇద్దరు అరెస్ట్..

హీరో దర్శన్ అభిమానులు తనను బెదిరిస్తున్నారంటూ నటి రమ్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రమ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆదివారం ( ఆగస్టు 3 ) ఇద్దరినీ అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రమ్యపై అసభ్యకర పోస్టులు పెట్టిన 13 సోషల్ మీడియా అకౌంట్స్ ని గుర్తించిన పోలీసులు ఇందుకు సంబందించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో 11 మందిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. జులై 24న రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు రమ్య.

Also Read :  ‘మహావతార్ నరసింహా’వసూళ్ల ప్రభంజనం

పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు బెంగళూరు పరిసర ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. అయితే.. నిందితులు ఇద్దరు దర్శన్ అభిమానులా కదా అన్నది తెలియాలి.ఇదిలా ఉండగా.. రేణుకస్వామి హత్య కేసు గురించి ఇటీవల సొషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు రమ్య. ఆ పోస్ట్ కి సంబంధించి దర్శన్ అభిమానులు సోషల్ మీడియాలో రమ్యపై అసభ్యకర కామెంట్స్ తో దాడికి దిగారని తెలిపారు రమ్య.

రేణుకాస్వామికి బదులుగా నిన్ను హత్య చేసి ఉండాల్సింది.. నిన్ను రేప్ చేస్తామంటూ ఎంతో మంది దర్శన్ అభిమానులు తనకు మెసేజ్ లు పెట్టారంటూ చెప్పుకొచ్చారు రమ్య. మెసేజ్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సైతం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు రమ్య. తన ఫ్యామిలీపై కూడా అసభ్యకర కామెంట్స్ చేశారని వాపోయారు రమ్య.