రివ్యూ: " రానా నాయుడు" వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

రివ్యూ:  " రానా నాయుడు" వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు క్రేజీగా ఉంటాయి. ఆ కాంబో స్ర్కీన్పై సందడి చేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు. అలాంటి కాంబినేషనే  బాబాయ్ విక్టరీ వెంకటేష్, అబ్బాయ్ రానా. గతంలో వీరిద్దరి  కృష్ణం వందే జగద్గురుం లో ఓ పాటలో మెరిశారు. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇన్నాళ్లకు వెబ్ సిరీస్లో బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా నటించారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది. డిఫరెంట్ లుక్లో నటించిన వెంకటేష్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..బాబాయ్ తో రానా పోటీ పడి నటించాడా..? చూద్దాం..

వెబ్ సీరిస్ ఎలా ఉందంటే..!

రానా నాయుడు ( దగ్గుబాటి రానా) ముంబైలో బాలీవుడ్ యాక్టర్స్ సమస్యలను తీరుస్తుంటాడు. ఏ అక్రమ పని అయినా చేయిగలడు. అయితే రానా నాయుడి తండ్రి నాగా నాయుడు (వెంకటేష్) నటించాడు. నాగా నాయుడు..చంచల్‌గూడ జైల్లో ఉండి వస్తాడు. అయితే తండ్రీ కొడుకులకు అస్సలు పడదు. ఇందులో ట్విస్ట్ ఏటంటే...నాగనాయుడును రానా నాయుడే జైలుకు పంపుతాడు.  ఓ అమ్మాయిని హత్య చేసినట్లు  తండ్రిపై తప్పుడు కేసు పెట్టి ఇరికించి జైలుకు పంపుతాడు. కానీ నాగా నాయుడు ఆమెను హత్య చేయలేదు. బాలీవుడ్ స్టార్ ప్రిన్స్ (అనుజ్ ఖురానా)ను యాక్సిడెంటల్ గా జరిగిన  హత్య.  ఈ విషయం తెలిసిన నాగా నాయుడు.. రానా నాయుడుని ఎలా డీల్ చేశాడు.  అసలు రానా తన తండ్రిని  జైలుకు ఎందుకు పంపాల్సి వచ్చింది. తన తండ్రి అంటే రానాకు ఎందుకు కోపం. ఇవన్నీ తెలియాలి అంటే రానా నాయుడు చూడాల్సిందే. 

విశ్లేషణ..

2013 లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సీరిస్  Ray Donovan కు రానా నాయుడు వెబ్ సీరిస్ రీమేక్. కుంభకోణాలు,  గన్స్ పేలుళ్లు,  డబ్బుల కట్టల చుట్టూ ఈ సీరిస్  సాగుతుంది. రానా నాయుడులో కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలకు క్రైమ్.., యాక్షన్, మాఫియా, డ్రగ్స్  వంటి అంశాలను జోడించి ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించారు.  రానా నాయుడు మెల్లగా ప్రారంభమై...సీరియస్ గా సాగుతుంటుంది.  కుటుంబ సభ్యుల మధ్య సమస్యల సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా రాసుకున్నారు.  రానా, వెంకటేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు పండించాయి. అయితే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు చూసే వారికి నార్మల్ గా అనిపించినా..సాధారణ ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. రానా నాయుడు..ఒక్కో ఎపిసోడ్  దాదాపు 50 నిమిషాల పాటు ఉంటాయి. మొత్తంగా 10 ఎపిసోడ్లు అంటే..దాదాపు 500 నిమిషాలు ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ ఎపిసోడ్ల తర్వాత కథలో వేగం పెరుగుతుంది. రానాకు అన్న  తేజ్ నాయుడు, తమ్ముడు  జఫ్ఫా నాయుడులు ఉంటారు. వీరి పాత్రలను దర్శకుడు చాలా కొత్తగా తీర్చిదిద్ది ఆకట్టుకున్నాడు. ఎంత మంది ఉన్నా..రానా, వెంకటేష్ ల చుట్టే కథ తిరుగుతుంటుంది.

ఎవరెలా నటించారు..?

నాగా నాయుడులో వెంకటేష్ నటను అద్భుతం. ఫ్యామిలీ హీరో  వెంకటేష్ కు ఈ పాత్ర కొత్తది అని చెప్పొచ్చు. నాగా నాయుడులో కొత్త వెంకటేష్ ను ప్రేక్షకులు చూస్తారు. రానా తన పాత్రలో ప్రవర్తించే విధానం.. మాట్లాడే భాష చాలా కొత్తగా ఉంటుంది. అటు జఫ్ఫా నాయుడు పాత్రలో  అభిషేక్ బెనర్జీ ఆకట్టుకున్నాడు. రానా భార్య పాత్రలో నటించిన సుర్వీన్ చావ్లా.. అన్న పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ పర్వాలేదనిపించారు.

దర్శకులు కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ రానా నాయుడు వెబ్ సిరీస్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. అటు సంగీత్, సిద్ధార్థ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కథకు ప్లస్. ఎమోషనల్ సీన్లను మ్యూజిక్ సిరీస్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. అటు జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం సన్నివేశాలను అతుక్కుపోయేలా చేస్తుంది.