రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్ట చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రానున్న రెండు రోజుల భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వరదల వల్ల పాత భవనాలు కూలినట్లయితే గ్రామ పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో ఆశ్రయం కల్పించాలని సూచించారు.
ఈ రెండు రోజులు ప్రతి అధికారి, వారి శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి సెలవులు కాని పెట్టకూడదన్నారు. విపత్తులు సంభవిస్తే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 7993103347, 040-23237416 లేదా హైడ్రా, డీఆర్ఎఫ్సమాచారం ఇవ్వాలని సూచించారు.
