నా చావుకు ఆ ఇద్దరే కారణం.. సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి

నా చావుకు ఆ ఇద్దరే కారణం.. సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి

తన చావుకు ఆ ఇద్దరే కారణమంటూ.. సెల్ఫీ వీడియోతో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఏనుముల జయంత్(26) అనే యువకుడు సెల్ఫీ విడియో తీసుకొని.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మార్చి 2 వ తేదిన హాస్పిటల్లో డయాలసిస్ రూములోకి నీళ్లు విషయంలో గొడవ జరిగింది. డయాలసిస్ రూంలోకి నీళ్లు రాకపోవడంతో  లేదని.. జయంత్ పోస్టుమార్టం రూమ్ దగ్గర ఉన్న బోరు దగ్గర చూడగా.. పక్కనే ఉన్న శ్మశానవాటికకు వేరొక కనెక్షన్ ఇవ్వటంతో వాటర్ సరిగా రావటం లేదని సూపరిండెంట్ కి వాట్సప్ ద్వారా సమాచారాన్ని అందించాడు. అయితే శ్మశానవాటికలో ఉన్నవారు తనతో గొడవ పడ్డారని జయంత్ సూపరిండెంట్ రఘునాథ్ కి చెప్పాడు.

ఆ సందర్భంలో తనను అర్దం చేసుకోకుండా, మందు తాగి హాస్పిటల్ కి వచ్చి.. న్యూసెన్స్ చేస్తున్నావని రిటన్ సూపరిండెంట్ తిట్టాడని ఆవేదనకు గురయ్యాడు జయంత్. అంతేకాకుండా తనను రేపటి నుంచి డ్యూటీకి రావద్దని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు సూపరిండెంట్. కారణం లేకుండ తనను ఎందుకు తీసివేసారని నిలదీశాడు జయంత్. అయినా తనకు ఏం సమాధానం చెప్పకుండా.. ఎస్సై మైబెల్లి ఫోన్ చేసి తనను మరింత ఓత్తిడి చేసి కావాలనే మార్చి 4వ తేదీన మరో కేసు నమోదు చేశారు. దీనితో మనస్థాపం గురైన జయంత్ ఈ రోజు(మార్చి 5) ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డు లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. 

తన ఆత్మహత్యకు ఆసుపత్రి సూపర్డెంట్ రఘునాథ్, ఎస్ ఐ మైబెల్లి వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు కారణమైన ఆసుపత్రి సూపర్డెంట్ రఘునాథ్, ఎస్ ఐ మైబెల్లి ఇద్దరిని కఠినంగా శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. తన షర్టుపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు జయంత్. మృతాదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పొలీసులు.