నిర్దేశిత మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ ఆదేశం

నిర్దేశిత మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని రంగారెడ్డి  కలెక్టర్ ఆదేశం
  •     నిర్దేశిత మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేద్దాం  
  •     రంగారెడ్డి కలెక్టర్ భారతీ హోళీకేరి

ఎల్​బీనగర్,వెలుగు :  హరితహారంలో జిల్లాకు కేటాయించే లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హొళీకేరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో 2024, 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి హరితహారం భవిష్యత్ కార్యాచరణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై చర్చించి మాట్లాడారు. ఆయా సంవత్సరాలకు సంబంధించి హరితహారంలో జిల్లాకు నిర్దేశించే లక్ష్యాన్ని  పూర్తి చేసేలా.. ప్రతి శాఖకు ఇచ్చిన టార్గెన్ ను పెండింగ్ లేకుండా పూర్తి చేసే విధంగా సూచించారు. 

నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

లబ్ధిదారులపై పర్యవేక్షణ పెట్టండి

 టీ- ప్రైడ్ టీఐడీయా స్కీమ్ ల కింద ఎస్సీ లబ్ధిదారుల కేటగిరిలో ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ లో యూనిట్లు పొందిన లబ్ధిదారులు నిరంతరం నడుపుకునే విధంగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ భారతి హొళికేరి అధికారులకు సూచించారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, టీఎస్ ఐ-పాస్ అధికారులతో సమావేశం నిర్వహించిన మాట్లాడారు. టీ -ప్రైడ్ కింద ఎస్సీ లబ్ధిదారులకు సబ్సిడీ ప్రోత్సాహంగా ఇచ్చే పథకాలు, ఎస్టీలు, దివ్యాంగులకు ఇచ్చే  పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.