ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు

ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు కీలక తీర్పు  వెలువరించింది.  ముగ్గురు (మట్టారెడ్డి,  బిక్షపతి,ఖాజా మొయినొద్దిన్) నిందితులకు జీవిత ఖైదు విధించింది.   2022 మార్చి 21న రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాఘవేంద్రను కాల్చి చంపారు  నిందితులు.  ఇబ్రహీంపట్టణం పోలీస్ స్టేషన్  పరిధిలోని కర్ణంగూడలో  శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు హత్యకు గురయ్యారు. 

ALSO READ : ఎంత కిరాతకం : కుక్కను గేటుకు ఉరి వేసి చంపారు

ఓ ల్యాండ్ విషయంలో తల దూర్చుతున్నాడని  శ్రీనివాస్ రెడ్డి, రాఘవేంద్రలను  చంపేందుకు వారిని హత్య  చేయాలని మట్టారెడ్డి ప్లాన్ వేశాడు.  వారిని చంపేందుకు ఇద్దరికి సుఫారీ ఇచ్చాడు మట్టారెడ్డి.  దీంతో  బిక్షపతి,ఖాజా మొయినొద్దిన్ లు వారిని కాల్చి చంపారు.  ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా తేల్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు.. వారికి జీవిత ఖైదు విధించింది.  ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్టణం ఏసీపీపై పోలీస్ శాఖ  విధుల నుండి తప్పించింది.