మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు: ముగ్గులు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. నగరంలోని పద్మావతి కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీకి ఎంపీతో పాటు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పద్మజా రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కాలనీ మహిళలు వేసిన వివిధ రకాల ముగ్గులను పరిశీలించారు.
పోటీలో గెలుపొందిన కె.వాణిశ్రీ, ఎస్. సుమిత్ర, ఇ.మహేశ్వరికి బహుమతులను అందజేశారు. ముగ్గులు ఇంటి ముందు వేసే అలంకరణ కాదని, మన సంస్కృతికి అద్దం పట్టే ఒక అద్భుతమైన కళాఖండమని తెలిపారు. పోటీ అంటే ఒకరు గెలవడం, మరొకరు ఓడిపోవడం కాదని.. మన మధ్య ఉన్న ఐకమత్యాన్ని చాటడమేనని తెలిపారు.
