రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘ధురంధర్’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యాక్షన్ సీన్స్‌లో మితిమీరిన హింస ఉండడంతో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లు మాత్రమే చూడాలని సూచించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రన్ టైమ్ బాలీవుడ్ సినీగోయర్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది. 3.34 గంటల నిడివితో ఈ చిత్రం రాబోతోంది.
2008లో వచ్చిన ‘జోథా అక్బర్’ నిడివి 3.50 గంటలు కాగా, 17 ఏళ్ల తర్వాత అత్యధిక నిడివితో ఈ సినిమా వస్తోంది. 1999లో జరిగిన ఐసి–814 విమాన హైజాక్, ఆ తర్వాత 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పాకిస్థాన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ను అంతం చేయడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు.
అతను ఎలాంటి పోరాటం చేశాడు.. కరాచీ అండర్ వరల్డ్ మాఫియాను ఎలా అంతం చేశాడన్నది మూవీ మెయిన్ కాన్సెప్ట్. మేజర్ మోహిత్ శర్మ లైఫ్ స్టోరీ ఇదని ప్రచారం జరగగా, ఇది ఎవరి బయోపిక్ కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
