ఘోర రోడ్డు ప్రమాదం.. తవేరాను ఢీ కొట్టిన లారీ

ఘోర రోడ్డు ప్రమాదం.. తవేరాను ఢీ కొట్టిన లారీ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బీజాపూర్ హైవేపై లారీ.. తవేరా వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తవేరా డ్రైవర్ అనీఫ్ (40) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న కొందరు వ్యక్తులు క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
తర్వాత మెరుగైన వైద్యం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి  హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డవాళ్లను యాలాల్ మండలం పగిడ్యాల్ కు చెందిన వారిగా గుర్తించారు. తవేరా డ్రైవర్ అనీఫ్ చేవెళ్ల మండలం నాగర్ గూడ వాసిగా పోలీసులు గుర్తించారు.

లారీ.. తవేరా  ఢీ కొట్టడంతో ముందు భాగమంతా నుజ్జు నుజ్జయింది. అందులోనే  తవేరా డ్రైవర్ అనీఫ్ ఇరుక్కుపోయి చనిపోయాడు. మృతదేహాన్ని  జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.