ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ర్యాపిడో

ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ర్యాపిడో

బెంగళూరు: రైడ్- హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ ర్యాపిడో ఫుడ్ డెలివరీలోకి అడుగుపెట్టింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఓన్లీ  అనే పేరుతో ప్రత్యేక యాప్‌ను లాంచ్ చేసింది. బెంగళూరులోని కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ వంటి కొన్ని ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.  

ఫుడ్ డెలివరీలో టాప్​లో ఉన్న జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ర్యాపిడో రెడీ అయింది. ఈ యాప్ ద్వారా రూ. 150 లోపు ధర ఉన్న ఆహార పదార్థాలను డెలివరీ చేయడంపై దృష్టి పెట్టింది.  చపాతీ, అన్నం, గుడ్లు వంటి వాటి ధరలు రూ. 100 లోపే ఉన్నాయి. ఓన్లీ ప్లాట్‌ఫారమ్ జీరో -కమీషన్ మోడల్‌తో పనిచేస్తుంది. దీని ద్వారా రెస్టారెంట్లకు తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తుంది.