నుదుటిపై మూడో కన్ను!.. విలువ రూ.180 కోట్లకు పైనే

నుదుటిపై మూడో కన్ను!.. విలువ రూ.180 కోట్లకు పైనే

మారుతున్న ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు స్టయిల్స్ మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు కొత్త స్టయిల్స్‌‌ను ఫాలో అవ్వడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ర్యాప్ సింగర్స్ అయితే భిన్నమైన హెయిర్ స్టయిల్స్, డ్రెస్సింగ్‌‌, కాస్ట్‌‌లీ వాచ్‌‌లతో అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఓ అమెరికా ర్యాప్ సింగర్ లిల్ ఉజీ వెర్ట్ కూడా వెరైటీగా ఆలోచించాడు. అందుకే కోట్ల రూపాయలు విలువ చేసే పింక్ డైమండ్‌ను నుదుటిపై అమర్చుకున్నాడు. దీనికి సంబంధించి ఉజీ రీసెంట్‌గా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లిల్ నుదుటిపై పింక్ డైమండ్ ధరించి కనిపించాడు. ఈ డైమండ్ ఖరీదు రూ.180 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. అసలు డైమండ్‌‌ను లిల్ నుదుటి మీద ఎలా ధరించాడా అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ విషయంపై లిల్ స్పందిస్తూ.. ఇది కొనేందుకు తన నాలుగేళ్ల సంపాదనను ఖర్చు చేశానని చెప్పాడు.