చీర్స్.. రూ.22కోట్లకు అమ్ముడపోయిన విస్కీ బాటిల్

చీర్స్.. రూ.22కోట్లకు అమ్ముడపోయిన విస్కీ బాటిల్

లండన్‌లోని సోథెబీస్ వేలంలో మకాల్లన్ 1926 బాటిల్ 2.1 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దీని విలువ రూ. 22.7కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్ గా మకాల్లన్ రికార్డు సృష్టించింది. ఈ వేలంలో విక్రయించబడిన వైన్ బాటిల్ లో ఈ సేల్ ఓ కొత్త రికార్డును నెలకొల్పిందని వేలం హౌస్ తెలిపింది.

ఈ రేర్ విస్కీ బాటిల్ 7లక్షల 50వేల డాలర్లు, 1.2మిలియన్ డాలర్ల మధ్య వసూలు చేస్తుందని ముందుగా అంచనా వేశారు. అయితే నవంబర్ 18న మాత్రం 21లక్షల 87వేల 500 డాలర్లు పొందవచ్చని అంచనా వేశారు. మకాల్లన్ 1926 బాటిల్ 2019నుంచి ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన బాటిల్‌గా మునుపటి రికార్డును నెలకొల్పింది. ఇది సోథెబీస్‌లో 1.5 మిలియన్ల డాలర్లను పొందింది.

సోథెబీస్ విస్కీ హెడ్, జానీ ఫౌల్.. అమ్మకానికి ముందు విలువైన ఈ విస్కీ సాంపిల్ ను టేస్ట్ చేసేందుకు అనుమతించబడ్డాడు. దీన్నుంచి ఓ చుక్కను రుచి చూశానని, ఊహించిన విధంగానే ఇందులో ఎండిన పండ్లు, చెక్క, మసాలా వంటి పదార్థాలున్నాయని చెప్పారు.