వైరల్: 1930లో సీవీ రామన్ నోబెల్ అందుకున్న వీడియో

వైరల్: 1930లో సీవీ రామన్ నోబెల్ అందుకున్న వీడియో

న్యూఢిల్లీ: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రామన్‌‌ 132వ జయంతి ఉత్సవాల సందర్భంగా నోబెల్ ప్రైజ్ ట్విట్టర్‌‌లో అరుదైన వీడియోను షేర్ చేసింది. 1930వ సంవత్సరంలో ఫిజిక్స్‌‌లో నోబెల్ బహుమతిని గెల్చుకున్న సీవీ రామన్.. ప్రైజ్‌‌ను అందుకునేందుకు స్వీడన్‌‌లోని స్టాక్‌‌హోమ్‌‌కు వెళ్లారు. ఈ వీడియోను నోబెల్ ప్రైజ్ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్‌‌లో పంచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియో వైరల్ అవుతోంది. కాంతి వికీర్ణంపై ‘రామన్ ఎఫెక్ట్’ పేరుతో వెలువరించిన పరిశోధనలకు గాను సీవీకి నోబెల్ బహుమతి దక్కింది. సైన్స్‌‌లోని ఏ బ్రాంచ్‌‌లోనైనా నోబెల్ అందుకున్న ఆసియా ఖండానికి చెందిన మొట్టమొదటి వ్యక్తిగా రామన్ రికార్డు సృష్టించారు.