మరొకరిలా నటించడం మానేయాలి: రాశీఖన్నా 

మరొకరిలా నటించడం మానేయాలి: రాశీఖన్నా 

రజినీకాంత్ సినిమా ‘ధర్మన్‌‌ – ది డెడ్లీ డాక్టర్‌‌‌‌’లో నటిస్తున్న రాశీఖన్నా.. ఇటీవల ఆయన నుంచి ఓ ప్రత్యేక బహుమతిని అందుకుంది. ఆ వివరాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమల్ హాసన్‌‌కు చెందిన  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్‌‌ టైమ్‌‌లో ఆమెకు ‘లివింగ్‌‌ విత్‌‌ ది హిమాలయన్‌‌ మాస్టర్స్‌‌’ అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని తలైవా గిఫ్ట్‌‌గా ఇచ్చారు.  

షాట్ గ్యాప్‌‌లో తమ మధ్య జరిగిన ఆధ్యాత్మికపరమైన చర్చలో ఈ పుస్తకం గురించి రజినీకాంత్ ప్రస్తావించారని,   తాను చదవలేదని చెప్పడంతో, రెండు రోజుల తర్వాత ఆయనే స్వయంగా గిఫ్ట్‌‌గా ఇచ్చారని చెప్పింది. గత కొన్ని వారాలుగా దీన్ని చదువుతున్నానంటూ అందులోని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘ఎదగడం అంటే ఏదో కొత్తగా మారిపోవడం కాదు... మనం ఎవరిలాగానో నటించడాన్ని వదిలేయడమే అసలైన ఎదుగుదల. 

మనలో చాలామంది సమాజం నుంచి ఎందుకు డిస్‌‌కనెక్ట్‌‌ అవుతారో ఈ పుస్తకం వల్ల అర్థమైంది. ఒకే రాత్రిలో మనం మనల్ని కోల్పోలేదు, మరొకరిలా మారడానికి సంవత్సరాల సమయం గడపడం వల్ల అలా జరుగుతుంది. ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. నా జీవితానికి ఒక నిశ్శబ్దమైన మార్గదర్శకం” అని రాశీ చెప్పింది.