సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్

సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్
  • బదిలీ అయిన విజయ్​కుమార్

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పోలీస్ కమిషనర్​విజయ్​కుమార్ హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా రష్మి పెరుమాళ్ సిద్దిపేట సీపీగా వస్తున్నారు. ప్రస్తుతం బదిలీ అయిన సీపీ విజయకుమార్ గతేడాది అక్టోబరు 6న సిద్దిపేట సీపీగా వచ్చారు. 

నాలుగు నెలల కాలంలోనే తనదైన ముద్ర వేశారు. డ్రంకన్​డ్రైవ్​ విషయంలో కఠినంగా వ్యవరిహంచడంతో పాటు సిద్దిపేటలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాత్రి వేళల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ  బందోబస్తు చేపట్టడం, బెల్టు షాపులను  నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించారు.